బిషప్ లతో టీ కాంగ్రెస్ నేతల భేటి

బిషప్ లతో టీ కాంగ్రెస్ నేతల భేటి

సికింద్రాబాద్ లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్ లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల మద్ధతు కోరారు. దీనికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ సానుకూలంగా స్పందించింది. ఈ సందర్బంగా బిషప్ లు తెలంగాణ లో వారి సమస్యలు, డిమాండ్లు తో కూడిన వినతి పత్రం సమర్పించారు. బిషప్ ల డిమాండ్లపై కాంగ్రెస్ నాయకులు సానుకూలంగా స్పందించారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా, ఏఐసీసీ మైనారిటీ విభాగం వైస్ చైర్మన్ అనిల్ ఏ థామస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానా రెడ్డి, రేవంత్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.