ఎవడి అబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నావ్

ఎవడి అబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నావ్

ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పట్ల టిఆర్ఎస్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ హోం శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.ఈరోజు ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పై టిఆర్ఎస్ ను జీవన్ రెడ్డి నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు.

అలాగే.. సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని.. ఇప్పుడు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పలు చేశారని తెలిపారు. ఇంకా ఎవడి అబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నావు కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల.. నిరుద్యోగుల హక్కు అని ఈ సందర్భంగా వివరించారు. ఐటీఐఆర్  ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగ అవకశాలు పెరుగుతాయని ఆ రోజున కాంగ్రెస్ ఈ ప్రాజెక్ట్ ను శాంక్షన్ చేసిందని వెల్లడించారు. అలాంటి ప్రాజెక్టును టిఆర్ఎస్ విస్మరించిందని మండిపడ్డారు. అసలు 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసింది ఏమైనా ఉందా అంటే కేసీఆర్ ఇంట్లో 5గురికి ఉద్యోగాలు రావడమేనని వివరించారు. అలాగే 2లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే భర్తీ చేసింది 18వేల లోపేనని ఆయన అన్నారు. అలాగే...విభజన చట్ట హామీలను కేంద్రం నుండి తీసుకురావడంలో కేసీఆర్ విఫలమయ్యారని జీవన్ రెడ్డి విమర్శించారు.