కాంగ్రెస్‌ ఎంపీ పరిస్థితి విషమం...

కాంగ్రెస్‌ ఎంపీ పరిస్థితి విషమం...

కాంగ్రెస్ ఎంపీ ఎంఐ షానవాస్ (67) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న షానవాస్ ను సోమవారం చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కీలక నేత ఊమెన్ చాందీ ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. షానవాస్ రెండేళ్ల కిందట కేన్సర్ భారీన పడ్డాడు. అది ప్రమేపి కాలేయానికి కూడా పాకిందని కేరళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో తెలిపారు. 2009, 2014 ఎన్నికల్లో కేరళలోని వాయ్‌నాడ్ నియోజకవర్గం నుంచి షానవాస్ ఎంపీగా ఎన్నికయ్యారు.