తెలంగాణకు కాంగ్రెస్‌ త్రిసభ్య కమిటీ..

తెలంగాణకు కాంగ్రెస్‌ త్రిసభ్య కమిటీ..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది. ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులతో సమాలోచనలు జరిగిన జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. వారి దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు, టికెట్ల కేటాయింపుపై చర్చలకు త్రిశభ్య కమిటీని రాహుల్‌ ఏర్పాటు చేశారు. భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలైలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.