దమ్ముంటే బండారం బయట పెట్టు

దమ్ముంటే బండారం బయట పెట్టు

దమ్ముంటే బండారం బయట పెట్టాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.కె.అరుణ సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ప్రచారయాత్రలో పాల్గొన్న ఆమె... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ ను ఆసుపత్రికి కేటాయిస్తామని తెలిపారు. పాత కలెక్టరేట్ ను అలాగే కొనసాగిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ నేతల భూముల రేట్లు పెరగడం కోసం అక్కడ కలెక్టర్ నిర్మించారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజిలకు అనుమతులు వస్తే... ఇప్పుడు మేమే తెచ్చాము అని టిఆర్ఎస్ చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. పాలమూరు అన్నదమ్ముల ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని అరుణ పిలుపునిచ్చారు.