ఓటింగ్ శాతం చూస్తే గెలుపు మాదే..

ఓటింగ్ శాతం చూస్తే గెలుపు మాదే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం చూస్తే ప్రజా కూటమి విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు సీపీఐ నేత నారాయణ... టీఆర్ఎస్ కు ఎన్నికల అధికారులు, పోలీసులు బరితెగించి సహకరించారని ఆరోపించిన ఆయన... కోట్లది రూపాయలు దొరికినా అవి ప్రజా కూటమి డబ్బుగా అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంతా చేసిన ప్రజా కూటమి విజయం ఖాయమని దీమా వ్యక్తం చేసిన నారాయణ... బీజేపీ నేతలు చేసిన ప్రచారం టీఆర్ఎస్ గెలుపు కోసం చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ - బీజేపీది అపవిత్రత కలయికని ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ నేత.. చంద్రబాబు ఎదో దేశం నుండి వచ్చాడని బీజేపీ నేతలు విషప్రచారం చేశారని... 11వ తేదీ వరకు మాదే గెలుపు అనుకుని సంతోషించే హక్కు కేటీఆర్‌కు ఉందంటూ సెటైర్లు వేశారు.