బాబు ఎన్నికలు వచ్చినప్పుడే మేలుకుంటాడు

బాబు ఎన్నికలు వచ్చినప్పుడే మేలుకుంటాడు

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలు వచ్చినప్పుడే మేలుకుంటాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ... నిషేధ భూములను కార్యకర్తలకు పట్టాలు ఇచ్చేందుకు సీఎం చూస్తున్నాడు. చంద్రబాబు కరువుని పట్టించుకోకుండా హెలికాప్టర్ లలో తిరుగుతున్నాడు. కరువుపై చర్యలు తీసుకోకపోతే అమరావతిలో ధర్నా చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు. రాఫెల్ కుంభకోణంలో మోడీ నిండా మునిగి తేలుతున్నారు. ఆలోక్ వర్మపై హై పవర్ కమిటీ వేసి తొలగించటమే ఇందుకు నిదర్శనం. 5 రాష్ట్రాల్లో ఓడిన తర్వాత 2019లో అధికారం కోసం ఓబీసీ రిజర్వేషన్లు తెచ్చాడని ఆయన ఆరోపించారు.