ప్రజాసేవకే పవన్ కల్యాణ్ వచ్చారు..

ప్రజాసేవకే పవన్ కల్యాణ్ వచ్చారు..

ఎన్నికలకు జనసేన, లెఫ్ట్ పార్టీలో సిద్ధమవుతున్నాయి... ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, జనసేన పొత్తులకు ముందడుగు పడింది. దీనిపై విశాఖ మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు... వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి వామపక్షాలు పోటీ చేస్తాయని.. రాజకీయాల్లో ఓ ప్రత్యామ్నాయం తీసుకువస్తామని వెల్లడించారు. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది జనసేన, సీపీఎం, సీపీఐ... మూడు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. ఈ నెల 18, 19, 20 వ తేదీల్లో ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటి చేయాలనేదానిపై చర్చిస్తామని తెలిపారు మధు. ఇక పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మరోవైపు రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం కార్యదర్శి... కేంద్రం ప్రభుత్వం ఇస్తామన్న ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. 11 కేంద్రీయ విద్యాలయాలు ఇస్తామని దానికి రూ.12000 కోట్లు నిధులు ఇస్తాం అని చెప్పి రూ. 820 కోట్లు ఇస్తారా? అని మండిపడ్డ ఆయన... ఇలా అయితే విభజన హమీలు నేరవేరడానికి 30 ఏళ్ల పడుతుందన్నారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయని ఆరోపించారు మధు... ఉత్తరాంధ్రలో సుమారు 30 వేల మంది ప్రజలు వలస కూలీలుగా మారారన్నారు. గిరిజన ప్రాంతంలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోంది... దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఐదు రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు దళితులు ఓట్లు వేశారు... అందుకే అగ్రవర్ణాల వారికి కొత్తగా రూపొందించిన రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇక ఇప్పుడు వస్తున్న కూటమిలు వల్ల పెద్ద ప్రయోజనం లేదన్న మధు... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీలు దేశంలో చాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని... బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలంటే ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇక ఫెడరర్ ఫ్రంట్ వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు మధు.