మాకు పవన్ కల్యాణ్ అండగా దొరికారు...

మాకు పవన్ కల్యాణ్ అండగా దొరికారు...

మేం ఒంటరి కాదు... మాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా దొరికారు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి. మధు.... జనసేన, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... కమ్యూనిష్టుల పోరాటానికి పెద్ద అండగా పవన్ లభించారని... ఏపీలో కమ్యూనిస్టులు ఒంటరి కాదు.. పవన్ కల్యాణ్ అండగా దొరికారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు నగరంలోని కార్పోరేటర్లు కలక్షన్ ఏజంట్లుగా మారారని మండిపడ్డ మధు... కార్పోరేటర్లు అవినీతి పనులతో కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. పౌర సేవలను ఆదాయ వనరుగా మార్చుకుని టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించిన మధు... సెప్టెంబరు 15లోపు అవినీతి పనులు మానుకోకపోతే... ప్రత్యేక పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.