సిట్టింగ్ ఎమ్మెల్యేల చూపు జనసేన వైపు...

సిట్టింగ్ ఎమ్మెల్యేల చూపు జనసేన వైపు...

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జనసేన పార్టీవైపు చూస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి పి. మధు... పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకేనన్న మధు... జనసేనతో ప్రస్తుతం ప్రజా సమస్యల పై అవగాహనతో కలసి పోరాటం చేస్తున్నామని... ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చలు జరుగుతాయన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య బందీయైన రాష్ట్రప్రజలకు మూడో ప్రత్యామ్నయంగా జనసేన ఏర్పడిందన్న సీపీఎం ఏపీ కార్యదర్శి... టీడీపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నారా హమారా సభలో పెళ్లి కానుకలు అందలేదన్న ముస్లింలపై కేసులు పెట్టారని ఆరోపించిన మధు... గుంటూరు ఎస్పీ... టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ యువకులపై నాన్ బెయిల్ కేసులు, రౌడీ షీట్లు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.