50 లక్షల కిలోలు కాల్చారు

50 లక్షల కిలోలు కాల్చారు

ఢిల్లీలో దీపావళి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. ఎంత ఘనంగా అంటే.. 50 లక్షల కిలోల క్రాకర్స్ ఒక్క ఢిల్లీలోనే కాల్చారు. గతేడాది కూడా ఇదే పరిమాణంలో కాల్చినట్లు నిపుణులు నిర్ధారించారు. క్రాకర్స్ పై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడం, అటు పొల్యూషన్ బాగా పెరిగిపోయి ఊపిరి తీసుకోవడం కష్టమైన తరుణంలో క్రాకర్స్ పాత పద్ధతిలోనే కాల్చారు. దీంతో ఢిల్లీలో పొల్యూటెంట్స్ పరిమితి విపరీతంగా 66 రెట్లకు పెరిగిపోయింది. ప్రజలు చాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఢిల్లీ మీద పొల్యూటెంట్స్ పొరలు పేరుకుపోయి ఆక్సిజన్ కనీస స్థాయికి పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. గాల్లోకి ప్రమాదకరంగా లక్షా 50 వేల కిలోల కాలుష్య ఉద్గారాలు చేరిపోయాయి. ఇవి కంటికి కనిపించవు కానీ.. ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి శ్వాస తీసుకోనీయవు. కంటిజబ్బులు, జలుబు, జ్వరంతో పాటు క్యాన్సర్ కు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీకి వచ్చే వెహికల్స్ పై ఆంక్షలు:
పొల్యూషన్ బాగా పెరిగిపోయిన కారణంగా ఢిల్లీకి వచ్చే వాహనాల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిత్యావసర వస్తువులతో వచ్చే వాహనాలు మినహా అన్ని మీడియం రేంజ్ ఫోర్ వీలర్స్ కు ఆంక్షలు వర్తిస్తాయి. ఈ రాత్రి 11 గంటల నుంచి 11 వ తేదీ రాత్రి 11 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.