జగన్‌పై దాడి ఎలా జరిగింది?

జగన్‌పై దాడి ఎలా జరిగింది?

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసు విచారణలో ఎన్‌ఐఏ అధికారులు దూకుడు పెంచారు. నిందితుడు శ్రీనివాసరావును నిన్న ఉదయం హైదరాబాద్‌ తీసుకెళ్లిన అధికారులు.. కోర్టు ఆదేశాలతో సాయంత్రానికి ప్రత్యేక వాహనంలో విశాఖకు తరలించారు. ఈక్రమంలో ఇశాళ విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు రానున్నారు. విమానాశ్రయంలో  వీవీఐపీ లాంజ్‌లోకి నిందితుడ్ని తీసుకెళ్లి, ఘటన జరిగిన తీరుతెన్నులను ఎన్‌ఐఏ అధికారులు రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. మరోవైపు.. నిందితుడిని అతని తరఫు న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని.. ఎప్పుడు ఎక్కడికి తరలిస్తున్నదీ సమాచారం అందించాలని కోర్టు ఆదేశించింది.