వారివల్లే చెన్నైకి విజయాలు...

వారివల్లే చెన్నైకి విజయాలు...

రెండేళ్ల పాటు నిషేదానికి గురై.. తిరిగి ఆరంగేట్రం చేసి.. మే 27న జరిగిన ఐపీఎల్‌-11 ఫైనల్ లో విజయం సాధించి మూడోసారి కప్పును సొంతచేసుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ విజయం అనంతరం చెన్నై జట్టుపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఈ జాబితాలో చేరాడు. గంబీర్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తమ కెప్టెన్‌ ధోనీని క్రికెట్‌ బాస్‌గా భావిస్తుందన్నాడు. మైదానంలో ధోనికి పూర్తి స్వేచ్చను ఇచ్చారు చెన్నై యాజమాన్యం.. దీంతో ధోని తన జట్టుకు తిరుగులేని విజయాల్ని అందిస్తున్నాడన్నారు. జట్టు యాజమాన్య స్వేచ్ఛ ద్వారానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా.. మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్‌ తెలిపాడు. ఐపీఎల్‌ వంటి టోర్నమెంట్‌లో కెప్టెన్‌కు ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ పేర్కొన్నాడు.

Photo: FileShot