జెట్ లో చెన్నై జిగేల్...

జెట్ లో చెన్నై జిగేల్...

గత ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించి చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ జ‌ట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ అనంతరం ముంబైలోని డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం చెన్నై జట్టు ఐపీఎల్‌-11 ట్రోఫీతో ప్రత్యేక విమానంలో సొంత గడ్డ చెన్నైకు చేరుకుంది. విమానం చెన్నై చేరుకునే సమయంలో జట్టు ఆటగాళ్లు సందడి చేసారు. ఆల్ రౌండర్ బ్రేవో హెయిర్ హోస్టెస్ కి కేక్ తినిపిస్తూ సందడి చేయగా.. ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్ హెయిర్ హోస్టెస్ తో కలిసి ఫొటోలకి పోజులిచ్చాడు. మరోవైపు విమానంలోని సిబ్బంది కప్పు పట్టుకుని ఎంజాయ్ చేశారు. వీరందరికి బిన్నంగా చెన్నై జట్టు కెప్టెన్ ధోని మాత్రం ఇవేమి పట్టించుకోకుండా నిద్రపోయాడు. మరిన్ని ఫొటోల కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి.   

http://www.ntvtelugu.com/gallery/air-crew-join-with-csk-celebrations