13 మండలాలపై 'తిత్లీ' తుఫాన్ ప్రభావం...

13 మండలాలపై 'తిత్లీ' తుఫాన్ ప్రభావం...

తీరం దాటిన తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోంది... తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతిచెందగా... తిత్లీ ప్రభావం 13 మండలలపై ఉందంటున్నారు అమరావతిలోని ఆర్టీజీ సెంటర్ సీఈవో బాబు... ప్రస్తుతం గాలి వేగం గంటలకు 40 కిలోమీటర్లకు చేరిందన్న ఆయన... రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనులు ప్రారంభమైనట్టు తెలిపారు. ఇవాళ రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని... రెండు రోజుల ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేయడంతో నష్టం తగ్గిందని వివరించారు. తుఫాన్‌తో పెద్ద మొత్తంలో పంటలకు నష్టం జరిగినట్టు వెల్లడించారు.