భారత దేశమే ఆయన కుటుంబం: పురందేశ్వరి

భారత దేశమే ఆయన కుటుంబం: పురందేశ్వరి

భారత దేశమే ప్రధాని మోడీ కుటుంబం అని బీజేపీ మహిళా మోర్చ ఇంచార్జి పురందేశ్వరి అన్నారు. నేడు ఆమె అమరావతిలో మాట్లాడుతూ... నోట్ల రద్దు వల్ల 3.5లక్షల డొల్ల కంపెనీలను మూసివేశాం. నల్ల కుభేరుల పని పట్టినందుకా ప్రధాని మోడీని గద్దె దించాలని సీఎం చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. జీయస్టీ వల్ల దేశంలో ఆదాయం పెరిగింది. కంపెనీలు స్థాపన పెరిగి ఉద్యోగత పెరిగిందన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు. రాష్ట్రంలో జరికే అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోంది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయని పురందేశ్వరి అన్నారు.

ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రటోకాల్ పాటించకపోవటం సోచనీయం అని పురందేశ్వరి అన్నారు. గుంటూరులో మోడీ సభ మేము ఊహించిన దానికన్నా విజయవంతం అయింది. మోడీ అనుబంధం, సంబధం దేశంతోనే. భారత దేశమే ఆయన కుటుంబం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించాలి. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు.

తెలుగు ప్రజల మనస్సులలో కేంద్రంపై అపోహలు పెంచేందుకు కుట్ర జరుగుతోందని పురందేశ్వరి ఆరోపించారు. కేంద్రం లేవనెత్తిన అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తే నిధులు ఇవ్వడానికి సిద్దం అని స్పష్టం చేశారు. కడప స్టీల్ కర్మాగారం, దుగ్గరాజు పట్నం పోర్టు విషయంలో కేంద్రానికి అనుమానాలు ఉన్నాయి. లేవనెత్తిన అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజ్  అంగీకరించి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయలేదు కనుకనే ప్యాకేజీ నిధులను కేంద్రం ఇవ్వలేక పోయిందని ఆమె తెలిపారు.