నారా బాబు అవతారంలో రానా బాబు ఎలా ఉన్నాడో చూశారా..?

నారా బాబు అవతారంలో రానా బాబు ఎలా ఉన్నాడో చూశారా..?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా శెరవేగంగా షూటింగ్ జరుగుతున్నది.  ఇందులో నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఓ రోల్ కూడా ఉన్నది.  ఈ రోల్ లో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే.  బాహుబలి సినిమాలో రానా కండలు పెంచి భారీగా ఉంటె.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం ఆ కండలు కరిగింది.. సన్నగా మారిపోయారు.  అచ్చు నారా చంద్రబాబు అప్పట్లో ఎలా ఉండేవారో అచ్చంగా అలా మారిపోయారు.  నారా బాబు గెటప్ లో రానా బాబు పిక్ ఒకటి బయటకు వచ్చింది.  ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు.  బాలకృష్ణతో పాటు విద్యాబాలన్, తమన్నా, సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు నటిస్తున్నారు.