నిఖిల్ 'ముద్ర'కు టైమ్ కుదిరింది !

నిఖిల్ 'ముద్ర'కు టైమ్ కుదిరింది !

చివరగా 'కిరాక్ పార్టీ'తో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో నిఖిల్ చేస్తున్న కొత్త చిత్రం 'ముద్ర'.  ఇన్వెస్టిగేటివ్   జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తయింది.  దీంతో సినిమాను నవంబర్ 8న తేదీన విడుదలచేయాలని నిర్ణయించారు నిర్మాతలు.  

చివరి షెడ్యూల్ షూట్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు టిఎన్.సంతోష్ డైరెక్ట్ చేస్తున్నారు.  వేణు గోపాల్, రాజకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇందులో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.