మనిషా.. మాంత్రికుడా...?

మనిషా.. మాంత్రికుడా...?

బ్రిటిష్ సాకర్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్ మైదానంలో ఎంతగా మాయ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫుట్‌బాల్ ఏ పొజిషన్‌లో ఉన్నా.. మెరుపు వేగంతో గోల్ చేయడం ఆయన స్పెషాలిటీ. అదే బెక్‌హమ్‌‌ను ఇంటర్నేషనల్ సెలబ్రిటీ చేసింది. తాజాగా ఓ బీచ్‌లో సరదాగా సేదతీరుతూ ఇసుక తెన్నుల్లోనూ కరెక్ట్‌గా గోల్స్ చేశాడు డేవిడ్.. అందులో ఇతగాడి విన్యాసాలను చూసి ఇతను నిజంగా మనిషా.. లేకపోతే మాంత్రికుడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.