వ్యాఖ్యాతగా వార్నర్‌ ...

వ్యాఖ్యాతగా వార్నర్‌ ...

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొత్త అవతారం ఎత్తాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని డేవిడ్ వార‍్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కాళీ సమయంలో.. వ్యాఖ్యాతగా వార్నర్ వ్యవహరించనున్నాడు. వచ్చేవారం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌లో ఐదు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్ ఆడనుంది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా బుధవారం తొలి వన్డే జరగనుంది. ఆ తరువాత శనివారం కార్డిఫ్‌లో రెండో వన్డే జరగుతుంది. ఈ వన్డేలో చానెల్ 9 తరపున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అందుకోసం వార్నర్ చానెల్ 9 కామెంటేటర్ల బృందంతో కలిసి కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఈ సిరీస్ అనంతరం కెనడాలో గ్లోబల్ టీ-20 టోర్నీలో వార్నర్ ఆడనున్నాడు. 'వార్నర్ గత పది సంవత్సరాల కాలంగా వన్డే, టీ-20లలో గొప్ప ఆటగాడు కావున ఇంగ్లండ్‌ సిరీస్ లో అతను వ్యాఖ్యాతగా సఫలమవుతాడని' చానెల్ 9 స్పోర్ట్స్ డైరెక్టర్ టామ్ మలోన్ తెలిపాడు. 

Photo: Fileshot