చనిపోయిన వ్యక్తి.. ఏడుపులు విని లేచాడు.. కానీ..

చనిపోయిన వ్యక్తి.. ఏడుపులు విని లేచాడు.. కానీ..

మృతిచెందాడనుకుంటే నిద్రలోనించి లేచి నట్టుగా లేచి కూర్చుని ఓ వ్యక్త కుటుంబ సభ్యులకు, బంధువులకు షాక్‌ ఇచ్చినంత పనిచేశాడు... కాసేపు అందరితో మాట్లాడి.. మళ్లీ నిద్రలోకి జారుకున్నట్టుగానే తిరిగిరాని లోకాలకు వెళ్లి అందరినీ శోక్రసంద్రంలోకి నెట్టాడి. నిర్మల్‌ జిల్లా నరసాపూర్‌ మండలంలో జరిగిన ఈ ఘటన కొంత ఆశ్చర్యం కలిగించిన అందరినీ కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే నరసాపూర్‌ మండలంలోని దర్యాపూర్‌ గ్రామానికి చెందిన 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక, శుక్రవారం ఉదయం కళ్లు, నోరు తెరవకపోవడంతో లింగన్న మృతిచెందాడనే నిర్ధారణకు వచ్చిన కుటుంబసభ్యులు... బంధువులకు సమాచారం ఇచ్చారు. విదేశాల్లో ఉన్న కుమారుడు కూడా స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు... మరోవైపు అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి... లింగన్న చుట్టూ చేరి కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరవుతున్న సమయంలో నిద్రలోంచి లేచినట్టుగానే ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాక్ తిన్నారు. ఇక ఆయనకు ఏం కాలేదని సంతోషపడ్డారు... అయితే, శుక్రవారం సాయంత్రం వరకు కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడిన లింగన్న... ఆ తర్వాత మళ్లీ కన్నుమూశాడు. ఉదయం లేచినట్టుగానే లింగన్న లేస్తాడని అందరూ ఎదురు చూసినా నిరాశే మిగిలింది... ఆ తర్వాతే వాళ్లకు అర్థమైంది లింగన్న శాశ్వతంగా కన్నుమూశాడని.