గుంతల వల్ల ఇంత మంది చస్తున్నా... పట్టదా..!

గుంతల వల్ల ఇంత మంది చస్తున్నా... పట్టదా..!

రోడ్లపై గుంతల వల్ల రోజు ఎంతో మంది చనిపోతున్నారు... అయినా మీకు పట్టదా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.  ఐదేళ్లో గుంతల వల్ల ప్రమాదాలు జరిగి సుమారు 14,926 మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టు తెలిపింది. ఇది క్షమించరాని నేరం కాదా అని ప్రశ్నించింది. రోడ్డుపై పడిన గుంతల వల్ల దేశ వ్యాప్తంగా ఎంతో మరణిస్తున్నారని జస్టిస్ మదన్ బి. లోకూర్ ఆధ్వార్యంలో ఏర్పాటు చేసిన బెంచ్  అభిప్రాయపడింది. ఈ సంఖ్య సరిహద్దుల్లో, టెర్రిరిస్టుల భారిన పడి మృతి చెందిన వారి కంటే ఎక్కువ అని పేర్కొంది. ముఖ్యంగా 2013-17 మధ్య జరిగిన ప్రమాదాలు రోడ్డుపై పడిన గుంతల వల్లే ఎక్కువగా జరిగాయని బెంచ్ సభ్యులు జస్టిస్ దీపక్ గుప్తా, హేమంత్ గుప్తా అభిప్రాయపడ్డారు. రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవటమే ఈ చావులకు కారణమని బెంచ్ తేల్చి చెప్పింది.  రోడ్ భద్రతపై వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. అధికారులు రోడ్డు నిర్వహణపట్ల అశ్రద్ధ వహిస్తున్నారనీ, వాటి విధులు వారు సరిగ్గా నిర్వహించటం లేదని అర్థమవుతోందని కోర్టు అభిప్రాయపడింది.  రోడ్డు భద్రత సరిగా లేకపోతే  దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది.