రాత్రి 11 నుంచి భారీ వాహనాలకు నో ఎంట్రీ

రాత్రి 11 నుంచి భారీ వాహనాలకు నో ఎంట్రీ

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గాలిలో పెద్ద మార్పు రావడం లేదు. గాలి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి 11 గంటల నుంచి సరుకులు రవాణా చేసే భారీ, మధ్య తరగతి శ్రేణి వాహనాలు ఢిల్లీలో ప్రవేశించరాదు. ఇవాళ రాత్రి 11 నుంచి నవంబర్ 11 వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ప్రకటించారు. మొదట డిసెంబర్ 11 వరకు ఈ నిబంధన విధించారు. నిత్యావసర వస్తువులు చేరవేసే వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఈ చర్య చేపట్టారు.