బ్యాటింగ్‌ ఎంచుకున్న డేర్ డెవిల్స్

బ్యాటింగ్‌ ఎంచుకున్న డేర్ డెవిల్స్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు... ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 8 మ్యాచ్‌లలో విజయం సాధించి... కేవలం రెండు అపజయాలతో 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న హైదరాబాద్‌ తన దూకుడు కొనసాగించాలని భావిస్తుండగా... కేవలం మూడు మ్యాచ్‌లలో గెలిచి ఏడు ఓటములతో అట్టడుగుకు పడిపోయిన ఢిల్లీ... గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.