జీఎస్టీ ఎగవేసిన రిసార్టు సీఎండీ అరెస్ట్..

జీఎస్టీ ఎగవేసిన రిసార్టు సీఎండీ అరెస్ట్..

భారీ ఎత్తున్న జీఎస్టీ ఎగవేసిన కేసులో హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రముఖ రిసార్ట్‌ సీఎండీని అరెస్ట్ చేశారు అధికారులు... జీఎస్టీ ఎగవేతకు పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్టు డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ ప్రకటించింది. కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్న సదురు రిసార్ట్‌ నిర్వాహకులు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 13.81 కోట్లు చెల్లించలేదని పేర్కొంది. చట్ట ప్రకారం వినియోగదారుని నుంచి వసూలు చేసే జీఎస్టీని నిర్ణీత గడువులోపు ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు అందజేసినా పట్టించుకోలేదు. దీంతో తీవ్రంగా పరిగణించిన అధికారులు... రిసార్ట్‌ ఎండీని అరెస్ట్ చేవారు. ఈ నెల 18 రిమాండ్‌కు తరలించారు. ఇక రిసార్టు సీఎండీకి చెందిన ఐదు బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు అధికారులు.