భారీ మల్టీస్టారర్ మొదలుపెట్టిన స్టార్ హీరో !

భారీ మల్టీస్టారర్ మొదలుపెట్టిన స్టార్ హీరో !

తమిళ స్టార్ హీరో ధనుష్ కు దర్శకత్వం కొత్తేమీ కాదు.  గతంలో ఆయన డైరెక్షన్లో రూపొందిన 'పవర్ పాండి' మంచి హిట్ గా నిలిచింది.  తాజాగా ఆయన తన డైరెక్షన్లో మరొక కొత్త సినిమాను మొదలుపెట్టారు.  నిన్ననే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది.  

ఇందులో ధనుష్ తో పాటు తమిళ స్టార్ నటులు ఎస్.జె.సూర్య, శరత్ కుమార్, తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జునలు నటిస్తున్నారు.  అతిథిరావ్ హైదరి కథానాయిక.  శ్రీ తేనండాల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.