ధనుష్ కు డేట్ దొరికింది !

ధనుష్ కు డేట్ దొరికింది !

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'మారి 2'.  ట్రైలర్ తో అదరగొట్టే రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా పై తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.  సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ధనుష్ అండ్ టీమ్ ఈ నెల 21ని ఫిక్స్ చేసుకుంది.  బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది.  2015లో వచ్చి సూపర్ హిట్టైన 'మారి'కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది.  ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.