ఢిల్లీలో బాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

ఢిల్లీలో బాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం

విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్షకు దిగారు. దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో కొద్ది సేపటి క్రితం ధర్మ పోరాట దీక్ష ప్రారంభించారు. నల్ల చొక్కా వేసుకుని దీక్షలో కూర్చొన్నారు. ఈ దీక్షలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా హాజరయ్యారు. బాబుకు మద్దతుగా  ప్రజా, ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఢిల్లీకి తరలివచ్చారు. 
అంతకముందు ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ సమాధికి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. ఇవాళ రాత్రి 8 వరకు ఈ దీక్ష కొనసాగుతుంది.