జనసేనలో బయటపడ్డ విభేదాలు...

జనసేనలో బయటపడ్డ విభేదాలు...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓవైపు ప్రజా సమస్యలు అధ్యయనం చేస్తూ... ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు వెళ్తుంటే... మరోవైపు తిరుపతిలో జనసేన పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. తిరుపతిలోని కొర్లగుంట గురవారెడ్డి సమాధి దగ్గర ఆ పార్టీ నేత సురేష్ పై మరో నేత కిరణ్ రాయల్ దాడిచేశారు... నలుగురితో కలిసి సురేష్‌పై దాడిచేసి చితకబాదాడు కిరణ్ రాయల్... దీంతో తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించిన సురేష్... తనపై దాడి చేసిన కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కేను నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.