ప్రపంచ మార్కెట్లలో దీపావళి 

ప్రపంచ మార్కెట్లలో దీపావళి 

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు చెక్‌ పడటంతో అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. హౌస్‌ ఆఫ్‌ రెప్రెజెంటేటివ్స్‌లో డెమొక్రాట్లకు పూర్తి ఆధిక్యం లభించడంతో... ట్రంప్‌ దూకుడుకు కళ్ళెం పడుతుందని, ఆర్థిక విధానాల్లో స్థిరత్వం వస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. డాలర్ క్షీణించడం కూడా కలిసి వచ్చింది. చాలా ఏళ్ళకు షేర్లు, ఈల్డ్‌ .. రెండూ పెరిగే పరిస్థితి అమెరికాలో నెలకొంది. నాస్‌డాక్‌ రికార్డు స్థాయిలో 2.6 శాతంపైగా పెరిగింది. డౌ జోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 కూడా రెండు శాతంపైగా పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.  జపాన్‌ నిక్కీ రెండు శాతం లాభపడగా, హాంగ్‌సెంగ్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా షేర్లలో లాభాలు మాత్రం ఒక మోస్తరుగా ఉన్నాయి. 

మన మార్కెట్లకు సెలవు

దీపావళి సందర్భంగా మహారాష్ట్రలో జరుపుకునే బలిప్రతిపద పండుగ సందర్భంగా ఇవాళ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. కమాడిటీ మార్కెట్లకు సెలవున్నా... సాయంత్రం నుంచి ట్రేడింగ్‌ ఉంటుంది.