డోన్‌లో డాక్టర్‌ హత్య

డోన్‌లో డాక్టర్‌ హత్య

చికిత్స చేసేందుకు వెళ్లిన ఓ డాక్టర్‌ శవమై కనిపించడం కలకలం రేపింది. కర్నూలు జిల్లాలోని డోన్‌ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పోచా ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ప్రభాకరరెడ్డి కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌(47) వద్దకు గురువారం రాత్రి నలుగురు యువకులు వచ్చారు. వాళ్లకు చికిత్స చేయాలంటూ ఆటోలో ఆ డాక్టర్‌ను వెంటబెట్టుకు తీసుకెళ్లారు. వాళ్లతో వెళ్లిన శ్రీకాంత్‌ ఇవాళ ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేసి.. మరోవైపు పట్టణంలో గాలించారు. ఈక్రమంలో ఉదయం పట్టణంలోని ఇండోర్‌ స్టేడియం సమీపంలో శ్రీకాంత్‌ శవమై కనిపించరు. చికిత్స పేరుతో ఆటోలో తీసుకువెళ్లిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  శ్రీకాంత్‌ తండ్రి డాక్టర్‌ ప్రభాకరరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్నారు.