దావోస్ కు ట్రంప్ డుమ్మా... 

దావోస్ కు ట్రంప్ డుమ్మా... 

స్విట్జర్ లాండ్ దావోస్ లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక సదస్సుకు (డబ్య్లూఈఎఫ్) అమెరికా అధ్యక్షులు ట్రంప్ డుమ్మా కొట్టనున్నారు.  అమెరికాలో  షట్ డౌన్ కొనసాగటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా-మెక్సికో గోడ కట్టేందుకు నిధులు ఇవ్వటానికి విపక్షాలు నిరాకరించటంతో షట్ డౌన్ కొనసాగుతోంది. గోడ నిర్మాణానికి ట్రంప్ 5.7 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. గోడ నిర్మాణంతో అక్రమ వలసలు ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు. అయితే... కాంగ్రెస్ ఆయన డిమాండ్లను తిరస్కరించింది. నిధులు విడుదలకు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో షట్ డౌన్ ప్రకటించారు. దావోస్ సదస్సు ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. ట్రంప్ దావోస్ పర్యటనకు గతంలోఐదురోజుల షెడ్యూల్ ఖరారైంది. తాను గౌరవంతో దావోస్ ట్రిప్ రద్దు చేసుకుంటున్నాననీ.. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని ట్రంప్ ట్వీట్ లో పేర్కొన్నారు.