డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ నటుడు

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ నటుడు

పోలీసులు ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తనికీలు చేస్తున్న కొద్దీ పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మందు బాబులు. శనివారం రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనికీలల్లో  'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నటుడు కిరీటి దామరాజు కారును డ్రైవ్ చేస్తుండగా.. ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. ఆయన బ్లడ్ ఆల్కహాల్ లెవల్ 36గా నమోదైంది. వెంటనే కారును స్వాధీనం చేసుకుని కేసు బుక్ చేశారు పోలీసులు.

మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ లేడీ పట్టుబడింది. పూటుగా మద్యం తాగి పట్టుబడిన ఆ లేడీ తప్పించుకునేందుకు ట్రై చేసి.. ఏటీఎం సెంటర్ కు వెళ్లి డ్రెస్ మార్చుకుంది. వాహనం తాను నడపలేదంటూ మరో యువతిని చూపించింది. ఈ ఘనటనను షూట్ చేసున్న మీడియాను చూసి పరుగుపెట్టింది ఆ లేడీ. వాహనం నడిపిన యువతీ తప్పించుకోవడంతో.. పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ తనిఖీల్లో మొత్తం 20 వాహనదారులపై  కేసులు బుక్ చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.