రానున్న రెండు రోజులు పొడి వాతావరణం

రానున్న రెండు రోజులు పొడి వాతావరణం

వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తూర్పు దిశ/ఆగ్నేయ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో ఈశాన్య దిశ/తూర్పు దిశ నుండి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో కూడా రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.