కార్తీ చిదంబరం ఆస్థులు అటాచ్

కార్తీ  చిదంబరం ఆస్థులు అటాచ్

కేం‍ద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆస్థులను ఈడీ అటాచ్ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై కేసు విచారణలో ఉంది.  ఆయన సంస్థకు చెందిన భారత్‌, బ్రిటన్‌, స్పెయిన్‌లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్‌ చేశారు. 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ. 10లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్‌ డాలర్లుగా సవరించింది.