యూఏఈలో కనిపించిన రంజాన్‌ చంద్రుడు

యూఏఈలో కనిపించిన రంజాన్‌ చంద్రుడు

యూఏఈలో రంజాన్‌ చంద్రుడు కనిపించినట్లు ఇంటర్నేషనల్‌ అస్ర్టానమీ సెంటర్‌ ప్రకటించింది. అల్‌ అమీన్‌లోని జబేల్‌ హఫీత్‌ వద్ద చంద్రుడు దర్శనమిచ్చాడని పేర్కొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో రేపు రంజాన్‌ జరిగే అవకాశముంది. దీనిపై  ఈద్‌ కమిటీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మగరీబ్‌ నమాజ్‌ తరవాత మత పెద్దలు పండుగ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఆదివారం వరకు రంజాన్‌ సెలవులు ఇస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే. ప్రైవేట్‌ రంగ సంస్థలకు శుక్ర, శనివారం సెలవు ప్రకటించారు. ఆదివారం ఆఫీసులు పనిచేస్తాయి. ఈ రెండు ప్రకటనల తరవాత రేపు రంజాన్‌ జరుపుకోవడం ఖాయమని గల్ఫ్‌ మీడియా రాస్తోంది.