ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఏనుగుల హల్‌చల్‌

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఏనుగుల హల్‌చల్‌

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు గుడివంక ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. సుమారు 25 ఏనుగులు పోలాల్లోకి వచ్చి తిష్ట వేశాయి. ఏనుగులు ఎప్పుడు గ్రామం మీద దాడి చేస్తాయోనన్న భయంతో గ్రామస్థులు గజగజ వణికిపోతున్నారు. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఫారెస్టు అధికారులు.. టపాకాయలు పేల్చి ఏనుగులను కర్ణాటకలోని అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ ఇలానే చేస్తే.. ఏనుగులు అడవిలోకి వెళ్లినట్టుగా వెళ్లి తిరిగి వచ్చేశాయి.