రెండోస్సారీ స్టీఫెన్‌సన్‌ కే ఛాన్స్

రెండోస్సారీ  స్టీఫెన్‌సన్‌ కే ఛాన్స్

తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను  రెండోసారి నామినేట్ చేస్తూ సీఈఓ రజత్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నామినేషన్ పై క్యాబినెట్ ప్రతిపాదనకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. క్యాబినెట్ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి గవర్నర్ నరసింహన్ పంపడంతో నియామక ఉత్తర్వులను ఎన్నికల అధికారి రజత్ కుమార్ అధికారికంగా వెలువరించారు.  స్టీఫెన్‌సన్‌ ఎంపికతో టిఆర్ఎస్ బలం 91కి చేరింది. ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడికి ఎమ్మెల్యేలతో సమానంగా అవకాశాలుంటాయి. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేయవచ్చు.