దుర్గగుడి వ్యవహారంపై అత్యవసర సమావేశం

దుర్గగుడి వ్యవహారంపై అత్యవసర సమావేశం

దుర్గగుడి చీర వివాదం నేపధ్యంలో ఎంపి కేశినేని నాని కార్యాలయంలో పాలకమండలి సభ్యులతో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అత్యవసర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇంద్రకీలాద్రి పై వివాదాలు తలెత్తితే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. పాలకమండలి వ్యవహార శైలితో తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. చెడ్డపేరు వస్తోంది. పాలనాపరమైన అంశాల్లో పాలక మండలి సభ్యులు ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని, కేవలం దుర్గ గుడి అభివృద్ది, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.


ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వివాదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీంతో దుర్గగుడి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఆలయ ఈవో పద్మకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. బ్రాహ్మణకార్పొరేషన్ ఎండీగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. అలాగే దేవాదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పద్మస్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు.