పాస్‌ మార్కుల కోసం..

పాస్‌ మార్కుల కోసం..

పరీక్షలు సరిగా రాయన విద్యార్థులు.. సైబర్‌ క్రైమ్‌ చేశారు.. ఏకంగా కళాశాల వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారు. తమకు నచ్చినన్ని మార్కులు వేసుకుని పాస్‌ చేసుకున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చిలో విడుదలైన సెమిస్టర్‌ పరీక్షల ఫలితాల్లో ఇదే కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్థులు  ఫెయిల్‌ అయ్యారు. ఏం చేయాలా.. అని ఆలోచిస్తూ.. ఏకంగా వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి పాస్‌ మార్కులు వేసుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన కళాశాల సిబ్బంది సర్వర్‌లో స్టోర్‌ చేసిన ఫలితాలను చూసి హ్యాకింగ్ చేసినట్టు నిర్ధారించారు. సైబర్‌ క్రైం పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో 12 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు.