పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు..!

పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు..!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవినీతి,అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల నిఘా వేదిక  నేత పద్మనాభ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నికలు  జరుగుతున్నా..డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్నిచోట్ల స్వయంగా ఎమ్మెల్యేలే ఏకగ్రీవమైతే 15 లక్షలు ఇస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. 30 ఎన్జీవో సంస్థలతో కలసి ఎన్నికల నిఘా వేదిక ఏర్పాటు చేసామని ప్రకటించిన పద్మనాభ రెడ్డి,  సంస్థ తరపున గ్రామాల్లోకి వెళ్లి చైతన్య పరుస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల పరిశీలకులు ఇచ్చే సమాచారం మేరకే తాము నడుచుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పడం సంతోషదాయకని పద్మనాభ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.