బీపీ లెక్క పెరిగింది

బీపీ లెక్క పెరిగింది

వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి బీపీ రావడం సహజంగా మారింది.  ఇప్పటి వరకు సాధారణ బీపీ 130/80 ఎమ్జీగా ఉంది.  అయితే, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఈ అంకెల్లో మార్పులు చేసింది.  130/80 ఏమ్.జీ గా ఉన్న బీపీని 140/90 ఎమ్.జీగా మార్చింది.   గతంలో 60 సంవత్సరాల లోపు వయసు కలిసిన వ్యక్తులకు సంబంధించి బీపీ 130/80గా, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు సంబంధించి బీపీ 140/90 గాఉండేది.  

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మనుషుల జీవనశైలి కారణంగా 30 సంవత్సరాల వయసు లోపున్న వ్యక్తులకే బీపీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, మానసిక ఆందోళన, ఇతరత్రా పరిస్థితుల కారణంగా బీపీ బారిన పడుతున్నాడు.  

కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుడైన డాక్టర్ రవిశంకర్ బీపీ కి సంబంధించి వస్తున్న మార్పులను వివరించారు.  " దేశంలో ఎక్కువమంది యువత హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారని అన్నారు.  బీపీతో బాధపడుతూ హాస్పిటల్ కు వస్తున్న వారిలో 30 సంవత్సరాల లోపున్న యువతే ఎక్కువగా ఉన్నారు".  వివిధ కారణాల వలన వస్తున్న బీపీకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక సవాల్ తో కూడుకొని ఉంటుంది.  ట్యూమర్, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే బీపీ కంటే కూడా ఒత్తిడి, ఆహారంలో మార్పుల కారణంగా వచ్చే బీపీనే ఎక్కువగా ఉంటోంది.  బీపీ ఎక్కువగా ఉన్న వారికే గుండెపోటు వస్తోందని సిఎస్ఐ పేర్కొంది.