మీ నాన్న వల్లే కాలేదు..: సోమిరెడ్డి

మీ నాన్న వల్లే కాలేదు..: సోమిరెడ్డి

పన్నెండు కేసుల్లో ఏ1గా ఉన్న వైసీపీ అధినేత జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏ1 అని విమర్శించడం దారుణమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిని ఆయన.. జగన్‌పై నిప్పులు చెరిగారు. చిన్నా పెద్దా లేకుండా సీఎం స్థాయి వ్యక్తిని విమర్శించడం సరికాదని అన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకుని, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్‌.. ఇప్పుడు చంద్రబాబును ఏ1 అని అనడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబును జైలుకు పంపిస్తానని జగన్‌ అంటున్నారని.. ఆ పని వైఎస్‌ వల్లే కాలేదని ఎద్దేవా చేశారు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని ప్రధాని మోదీకి తాకట్టు పెట్టిన జగన్‌.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మేలు చేసిన బీజేపీ.. రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.