టీమిండియాతో ఆడే ప్రతి మ్యాచ్ కీలకమైనదే

టీమిండియాతో ఆడే ప్రతి మ్యాచ్ కీలకమైనదే

టీమిండియాపై ఆడే ప్రతి మ్యాచ్‌ పాకిస్థాన్ జట్టుకి కీలకమేనదే అని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఆసియా కప్ ప్రారంభం అవనుంది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ 16న, భారత్ 18న తమ తొలి మ్యాచ్‌ను క్వాలిఫైయర్ హాంకాంగ్‌ జట్టుతో ఆడనున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య 19న మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ కోసం పాక్ జట్టు యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది.

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభంలోనే జట్టు లయ అందుకోవడం చాలా ముఖ్యం. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గెలిచి ఆత్మ విశ్వాసంతో భారత్‌తో ఫైనల్‌కి సన్నద్ధం అయ్యాం అని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో కూడా హాంకాంగ్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లోనే పాక్ విజయం సాధించాలని ఆశిస్తున్నా. హాంకాంగ్‌తో మ్యాచ్ లో గెలిచి భారత్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్దమవ్వాలనుకుంటున్నాం. భారత్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌ పాకిస్థాన్‌కి కీలకమే అని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది.. ఇపుడు దానిని పరిగణించాలని నేను అనుకోను. అన్ని మేటి జట్లు ముందుకు వెళ్లాలని చూస్తాయని.. మేము కూడా ఫైనల్ వెళ్ళడంపైనే దృష్టి పెట్టామని సర్ఫరాజ్ అన్నారు.