ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై కేసుకు పుట్ట డిమాండ్

ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై కేసుకు పుట్ట డిమాండ్

మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అండతో టేకు కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతుందని  మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన పుట్ట మధు..మొన్న అక్రమంగా టేకు కలప తరలిస్తుండగా, పోలీసుల చేసిన దాడిలో  19 టేకు దుంగలు దొరికాయని చెప్పారు.  స్మగ్లింగ్ గ్యాంగ్ లో శ్రీధర్ బాబు అనుచరుడు ఎడ్ల శ్రీను పరారీ ఉన్నాడని ఆయన అన్నారు.  అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై కేసులు పెట్టాలని పోలీసులకు పుట్ట మధు విజ్ఞప్తి చేశారు. అక్రమ కలప బాగోతాన్ని సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారాయన.