మధుయాష్కి కారు ధ్వంసం

మధుయాష్కి కారు ధ్వంసం

జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్ పల్లి పట్టణంలో మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిని కొమిరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. కార్యకర్తలు అంతటితో ఆగకుండా కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెద్దదయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.