బిసిల క్రిమిలేయర్ సంగతేందీ : విహెచ్

బిసిల క్రిమిలేయర్ సంగతేందీ : విహెచ్

కేంద్రంలోని మోడీ సర్కార్ ఆఘమేఘాలపై ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి, మిగిలిన అణగారిన వర్గాల ఊసేత్తడం లేదని మాజీ ఎంపి వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణని నాన్చుతున్న బిజెపి, బీసీలకు పెట్టిన క్రిమిలేయర్ ను ఇప్పటి వరకు ఎత్తేయలేదని విహెచ్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బిసి వర్గాలను ఓటు బ్యాంకు కింద మార్చేసిన బిజెపికి,  పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చోటా మోడీ  కేసీఆర్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ఓబీసీ వారికే అనుకూలంగా రిజర్వేషన్లను  మార్చాడని ఆరోపించారు.