తిరుపతి ఎక్సైజ్ ఎస్ఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుపతి ఎక్సైజ్ ఎస్ఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. తిరుపతి ఎక్సైజ్ ఎస్ఐ ఎర్రగోపుల విజయ్‌కుమార్‌ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయ్‌కుమార్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపారు. భారీగా బ్యాంక్ పాస్ బుక్స్, ఐదు సంచుల్లో రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. పలు మద్యం దుకాణాలను బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ.30కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. చిత్తూరు, తిరుపతి, కర్నూలు, తమిళనాడులోని కాట్పాడులో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ కుమార్ కర్నూలులోని నాగలాపురం చెక్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్నాడు.