ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందే..!!

ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందే..!!

ఎఫ్2 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  కామెడీ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఇటీవలే రిలీజైన రెండు తెలుగు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సంక్రాంతి ఆశలన్నీ ఇప్పుడు ఎఫ్ 2 సినిమాపైనే ఉన్నాయి.  వెంకటేష్.. వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్టుగా తెలుస్తోంది.  

దాదాపుగా ఈ సినిమా అన్ని ఏరియాలలో కలిపి రూ.34.50 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.