రైతుబంధుపై తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు..

రైతుబంధుపై తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకం తాత్కాలికమే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది... అయితే, ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఓ ప్రకటిన విడుదల చేశారాయన. ''తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారి మొదటి ప్రాధాన్యత రైతులను ఆదుకోవడమే.. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రైతులకు అండగా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారు. రైతుబంధు దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఇలాంటి పథకం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు మనలను రోల్ మోడల్ గా చూస్తున్న నేపథ్యంలో... తెలంగాణలో ఈ పథకం తాత్కాలికం అంటూ సోషల్ మీడియాలో కథనాలు రావడం బాధాకరం. ఆ వ్యాఖ్యలు నేను చేసినట్లుగా కొన్ని సంస్థలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించ వద్దు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు... మీడియా సంస్థలు, వార్తాపత్రికలు,  సోషల్ మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మనవి చేస్తున్నాం.'' అంటూ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి.